శ్రీ భాస్కరశర్మ, శ్రీమతి కస్తూరి దంపతుల సౌజన్యంతో 17-2-2025న శృంగవరపుకోటలోని ‘అమ్మ ఆలయంలో శ్రీ నాన్నగారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మ నాన్న గార్ల శ్రీ చరణాలను బియ్యంతో అభిషేకించారు.
ఈ ఉత్సవంలో సర్వశ్రీ జగన్నాథం, తులసీరావు, జనార్దన్, చిన్నమనాయుడు, మురళి, దినేష్, “శ్రీమతి లక్ష్మి పాల్గొని అమ్మ, నాన్నగారల అర్ధనారీశ్వరతత్త్వాన్ని, శివశక్ష్యైక్య వైభవాన్ని, ఆదిదంపతుల అనంత * వాత్సల్యాన్నీ, అనుగ్రహాన్ని స్తుతిస్తూ హృద్యంగా ప్రసంగించారు. అందరూ అమ్మ ప్రసాదాన్ని స్వీకరించి, అర్కపురిలో ఉన్న దివ్యానుభూతిని పొందారు.