1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శ్రీ హైమవతీదేవికి మంగళహారతి

శ్రీ హైమవతీదేవికి మంగళహారతి

Kondamudi Subba Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

శ్రీఅనసూయాతనయా! అభిషేకప్రియా!

మంగళం శ్రీనాగేశ్వర తనూజా! ప్రదక్షిణ ప్రియా! మంగళం

మంగళం మంగళం దివ్యమంగళం

 

కలియుగ కామధేనువై వెలసిన హైమవతీదేవీ! మంగళం

కలియుగ కల్పతరువుగా వెలసిన కామాక్షీదేవీ! మంగళం.

మంగళం మంగళం భవ్యమంగళం

 

మృదుమధుర భాషిణీ! దయామృత వర్షిణీ! మంగళం

కన్యారూపిణీ! కారుణ్యవర్షిణీ! మంగళం

మంగళం మంగళం జయమంగళం

 

కారుణ్యమూర్తీ! కామితార్ధప్రదాయినీ! మంగళం

వాత్సల్యమూర్తీ! వాంచితార్ధప్రదాయినీ! మంగళం

మంగళం మంగళం సర్వమంగళం

 

హంసవాహనరూపిణీ! విజ్ఞానప్రదాయినీ! మంగళం

సకల మంత్ర స్వరూపిణీ!

సకలార్ధప్రదాయినీ! మంగళం

మంగళం మంగళం శుభమంగళం

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!