1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ

సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ

Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

గురుని ఖండించి మరుగును గురువు చేసె

అసలునే శక్తియనియమ్మ నొక్కి చెప్పే

భ్రాంతి లేనట్టి బ్రహ్మము పట్టు చెప్పె

సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ,

గుణములో భేదమేమాత్ర మెంచలేదు

కులమతంబుల భేదము చూడలేదు.

మనసు నెరుగుచు బోధను మరచిపోయె

సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ

కష్టసుఖములు కరుణని బాగచెప్పె

తప్పులెంచని తల్లిగా తల్లడిల్లె

ప్రేమపంచుచు పోషించె నందరిల్లు

సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ

తెరలలోపల తననుతా దాచుకొనెను

మరుగుపరచుట తనదైన విధము అనియె

వర్గములులేని స్వర్గముకోరుకొనెను

సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ

ధ్యాసనే ధ్యానమంచును ఆచరించే

నేను అమ్మను అని తాను నిర్ణయించే

మొదటి స్పందన అసలని చెప్పెనామె 

సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ

వేదశాస్త్రాల నెప్పుడు నేర్వలేదు

 తనను గురువుగ నెప్పుడు చెప్పలేదు 

మాట మననాన మంత్రమౌనంచు చెప్పే 

సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ 

సుగతి కోరెను జగతిలో జీవులకును

 శక్తినే దైవమని తాను నమ్మ బలికె

 చావు పుట్టుక మార్పని చక్కబలికె

 సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ

నేను నేనైన నేనని నిశ్చయించె 

కాలమే గొప్పయౌనంచు వెలయజెప్పె 

తాడుపాములు భ్రాంతి కల్గించు ననియె

 సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ 

జీవితంబను జలధిని వెలయులక్ష్మి

 సహన సుందర శాంతి సుధారసంబు

 సత్యసౌందర్య విజ్ఞాన రూపమౌను 

సాటిలేనమ్మ జిల్లెళ్ళమూడి యమ్మ

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!