1. Home
  2. Articles
  3. Viswajanani
  4. స్పందన

స్పందన

Tangirala Ramamohan Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

మార్చి ‘విశ్వజనని’ 2024 సంచికలో కుమారి ఎ. నిత్య సంతోషిణి వ్రాసిన ‘అంఆ అమ్మ అంమ’ వ్యాసం చాలా బాగుంది. విద్యార్థులు అమ్మ గురించి ఇలా వ్యాసాలు రాయటం ముదావహం.

సోదరులు శ్రీ 1. రామకృష్ణ గారు దివంగత సోదరులు ‘శ్రీ గార్డన్ వెస్టర్లాండ్’ గురించి వ్రాసిన విశేషాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

సోదరులు శ్రీ ఎ. వి. ఆర్. సుబ్రహ్మణ్యం గారు రచించిన ద్రష్ట, దార్శనికుడు “C. G. Westerlund వ్యాసం చాలా ఆకట్టుకుంది.

“Renunciation? What is it?

If He is all, who renounces who?

In every house is God alone” అన్న చరణం మనసుకు హత్తుకుంది.

Westerlund గారి కవిత చదువుతున్నప్పుడు ఈ చరణం పైన నాలాంటి వారు శ్రద్ద పెట్టకపోవచ్చు. అదే చరణం గురించి శ్రీ సుబ్రహ్మణ్యం గారు చేసిన విశ్లేషణ ఆ చరణంవైపు ఆకర్షింపజేసింది.

“Flowers అంటే అసలైన అర్థం వారికి, అమ్మకి మధ్య జరిగిన సంభాషణ ద్వారా తెలిసింది. అలవాటుగా అన్ని పువ్వులుని కలిపి ఇంగ్లీష్ లో Flowers అనేస్తాం. అలా అనకూడదని ఈ వ్యాసం ద్వారా అర్థమయింది.

అన్నయ్యగారి వ్యాసం Westerlund గారికి అద్భుతమైన నివాళి.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!