హైమ

Nadeera
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 23
Month : April
Issue Number : 9
Year : 2024

నిను మరువదు మానవాళి

నీ కిదియే మా నివాళి!

అమ్మ గన్న హైమవతి

అమ్మ కన్న దయామతి

అని యందురు జనులందరు

నిను కందురు మణి వందురు.

 

నిను మరువదు మానవాళి

నీ కిదియే మా నివాళి!

పసిడివన్నె నీ కాయం

భగవతిపరమై పోయెను

భక్తజనుల కన్నీరే

భాగీరధియై పారెను

 

నిను మరువదు మానవాళి

నీ కిదియే మా నివాళి!

నీవు మమ్ము కాచి బ్రోచు

నిదర్శనం కనుగొంటిమీ

నిరుపమానమైన వరం

నీ దర్శన మనుకొంటిమి!

 

నిను మరువదు మానవాళి

నీ కిదియే మా నివాళి!

నిను తలచిన విజయ మని

నిను కొలిచిన అభయ మని

నిరూపించితివి అవని

నిజదేవత నీ పని

 

నిను మరువదు మానవాళి

నీ కిదియే మా నివాళి!

పరమేశ్వరి వొడిలో

పసిబాలవు ఒకనాడు – ఆ

పరమేశ్వరి మెడలో

పూమాలవు యిక నేడు

 

నిను మరువడు మానవాళి

నీ కిదియే మా నివాళి!.

(‘అన్నదాత సుఖీభవ’ – గ్రంథం నుండి) (15-4-2024 శ్రీ హైమాలయోత్సవ సందర్భంగా)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!