Siddheswari Peetadhipati – Courtallam
Mounaswamy Mutt,
Courtallam – 627802.
(Via Tenkasi),
Tirunelveli (Dt.)
TAMILNADU
Ph:04633-283707
పరమహంస, పరివ్రాజకాచార్య,
జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి
సిద్ధేశ్వరీ పీఠాధిపతి – కుర్తాళం
Camp Office : B1-C40,
Kali Peetham Street,
4th Line, Ravindra Nagar,
GUNTUR-522006
Ph : 0862-2231625 9440208103
మా పూర్వాశ్రమంలో పెద్ద తమ్ముడు పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్. మా నాయనగారు రామభక్తుడు. సుందరకాండ పారాయణం చేసిన ఫలితంగా పుట్టాడని ఆ పేరు పెట్టారు. సీతారామాంజనేయ ప్రసాదముగా భావించిన భావన. ఇక వంశంలో తరతరాలుగా కవిత్వం ఉంది. కనుక ఆ విద్య కూడ వారసత్వంగా సంప్రాప్తించింది. గద్య పద్యాత్మకమైన గ్రంథాలెన్నో రచించి సంఘంలో కవిగా మంచి స్థానాన్ని పొందాడు.
తల్లిదండ్రులంటే అనిర్వచనీయమైన భక్తి. వారిని గూర్చి ఇతడు వ్రాసిన పద్యాలలో ప్రేమ గౌరవ సాన్నిహిత్యభావనలు అపారంగా కనిపిస్తవి. ఎక్కువమందికి ఉండని మరొక విశేషం ఆత్మీయులైన మిత్రులు అధిక సంఖ్యలో ఉండటం. మరి కుటుంబజీవితం, ప్రేమ, వాత్సల్య, కర్తవ్య సేవాభావ పరిపూర్ణమై విజయోల్లసితమైనది. అలానే నా యందలి భక్తి – గౌరవము ఉదాత్తము, ఉన్నతము.
అన్నింటిని మించినది జిల్లెళ్ళమూడి అమ్మయందలి భక్తి. పి.యస్.ఆర్. అణువణువు ఆ భావతరంగాలతో సముద్దీపితమైనది. అనన్యచింతన, సర్వార్పణ – ప్రధానమైన ఈ జీవునకు అమ్మ తన సామీప్యమును అనుగ్రహించాలని ప్రార్థిద్దాము. నారాయణ స్మరణతో….
సిద్ధేశ్వరానంద భారతీస్వామి